News3rd Aug 10:27 AMSunil Byrisetty1 min read
"అడవి తల్లి బాట’’కు శ్రీకారం
‘‘ దేశంలో జాతీయ రహదారుల అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకొని, రాష్ట్రంలో మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో ‘‘అడవి తల్లి బాట’’ పేరుతో సుందరమైన రోడ్లు వేస్తున్నామని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప
‘‘
దేశంలో జాతీయ రహదారుల అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకొని, రాష్ట్రంలో మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో ‘‘అడవి తల్లి బాట’’ పేరుతో సుందరమైన రోడ్లు వేస్తున్నామని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పీఎం జన్ మన్ పథకం, ఉపాధి హామీ నిధులు, రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటు కలుపుకొని రూ.1005 కోట్లతో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రోడ్లు కూడా చూడని గిరి ప్రాంతాలను అనుసంధానం చేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వం కూల్చివేతలతో పాలన మొదలుపెట్టి రహదారుల గుంతలు, విధ్వంసం మిగిలిస్తే, దాన్ని అధిగమించి కూటమి పాలన ముందుకు వెళ్తోందన్నారు. ‘‘గిరిజన గ్రామాల్లో వేస్తున్న రోడ్లు కొత్త భవిష్యత్తుకు పునాది వేస్తాయి. అభివృద్ధిలో వెనుకబడిన గిరిపుత్రుల బతుకుల్లో కొత్త వెలుగులు తీసుకొస్తాయి. అడవి తల్లి బాట పథకానికి అడిగిన వెంటనే రూ.50 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వ గ్రాంటును విడుదల చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు" అని పేర్కొన్నారు. 1999లో స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టుతో రహదారుల దశను మార్చాలనే గొప్ప ఆలోచన చేసిన ఘనత ఆనాటి ఎన్డీయే ప్రభుత్వానిదని గుర్తు చేశారు. భారతరత్న అటల్ బిహారీ వాజపేయి మానసపుత్రికగా మొదలైన స్వర్ణఛతుర్జుజి ప్రాజెక్టు దేశ రహదారుల దిశను మార్చిన గొప్ప ముందడుగు అని అభివర్ణించారు. మార్చి 31, 2025 నాటికి దేశం మొత్తం మీద 1,46,204 కిలోమీటర్ల జాతీయ రహదారులు సమకూరాయంటే భారతదేశ వృద్ధి వేగం అర్ధం చేసుకోవచ్చని పవన్ కల్యాణ్ వివరించారు.