News8th Jan 04:12 PMSunil Byrisetty1 min read
పిఠాపురంలో పవన్ సంక్రాంతి సంబరాలు
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన సొంత నియోజకవర్గంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు పిఠాపురంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన సొంత నియోజకవర్గంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు పిఠాపురంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు, 'పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు' పేరుతో ముందస్తు సంక్రాంతి సంబరాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు స్థానిక ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్. కళాశాల మైదానంలో సంక్రాంతి సంబరాలను ప్రారంభిస్తారు. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలను, ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకిస్తారు. సాయంత్రం, ఇటీవల వర్షాలకు ముంపునకు గురైన పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్ కాలనీ, రైల్వే స్టేషన్ సమీపంలోని మోహన్ నగర్ ప్రాంతాల్లో పర్యటించి, స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. రెండో రోజైన శనివారం గొల్లప్రోలు మండలంలో పేదల కోసం కేటాయించిన ఇళ్ల స్థలాలను పరిశీలిస్తారు. కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.