News28th Aug 11:57 AMSunil Byrisetty1 min read
విశాఖలో జనసేన సమావేశాలు!
నేటి నుంచి విశాఖలో జనసేన సమావేశాలు జరగనున్నాయి. అందుకోసం విశాఖ మున్సిపల్ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం జనసేన లెజిస్లేటివ్ సమావేశం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం
నేటి నుంచి విశాఖలో జనసేన సమావేశాలు జరగనున్నాయి. అందుకోసం విశాఖ మున్సిపల్ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం జనసేన లెజిస్లేటివ్ సమావేశం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం జనసేన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. రేపు అంటే శుక్రవారం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా క్రియాశీల నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 30న జనసేన విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు.