News9th Jul 01:27 PMSunil Byrisetty1 min read

ముంబైకి పవన్ కల్యాణ్.. షూటింగ్ కాదు ట్రీట్మెంట్!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముంబైకి వెళ్లనున్నారు. అయితే సినిమా షూటింగ్ కోసం కాదు. కొంతకాలంగా భుజాల నొప్పితో పవన్ బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రి

ముంబైకి పవన్ కల్యాణ్.. షూటింగ్ కాదు ట్రీట్మెంట్!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముంబైకి వెళ్లనున్నారు. అయితే సినిమా షూటింగ్ కోసం కాదు. కొంతకాలంగా భుజాల నొప్పితో పవన్ బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో పవన్‌కు పరీక్షలు చేశారు. ఆ సమయంలో చికిత్స చేయించుకోవాలని పవన్‌కు వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం పవన్‌కు చికిత్స చేయనున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం జనసేన పార్టీ కీలక సమావేశం జరగనుంది. సమావేశానికి జనసేన ముఖ్యనేతలు హాజరు కానున్నారు. పవన్ ముంబై పర్యటనకు ముందు జనసేన కీలక సమావేశం జరగనుండటంతో ఆసక్తి నెలకొంది.
Andhra Pradesh
Pawan Kalyan
Mumbai
Shoulder Treatment
Kokilaben Hospital
Janasena Party
AP Deputy CM
Medical Treatment
జనసేన సమావేశం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
ఆరోగ్య అప్‌డేట్
Scroll for the next article