News3rd Jan 11:59 AMSunil Byrisetty1 min read

కొండగట్టుకు పవన్ కళ్యాణ్!

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. ఆలయ పరిసరాల్లో చేపట్టనున్న కీలక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ

కొండగట్టుకు పవన్ కళ్యాణ్!
కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. ఆలయ పరిసరాల్లో చేపట్టనున్న కీలక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. కొండగట్టు ఆలయానికి ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు, ముఖ్యంగా అయ్యప్ప మాలధారులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానాల (TTD) నిధులతో రూ.35.19 కోట్ల వ్యయంతో భారీ స్థాయిలో మౌలిక సదుపాయాలు నిర్మించనున్నారు. అందులో ప్రధానంగా దీక్ష విరమణ మండపం, భక్తుల సత్రం నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. ప్రతిపాదిత దీక్ష విరమణ మండపం ఒకేసారి సుమారు 2,000 మంది భక్తులు దీక్ష విరమణ చేసేలా విశాలంగా నిర్మించనున్నారు. ఆధునిక సదుపాయాలతో పాటు, భక్తులకు అనుకూలంగా డిజైన్ చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దీని వల్ల శబరిమల నుంచి వచ్చే అయ్యప్ప స్వామి భక్తులకు కొండగట్టులో దీక్ష విరమణ ప్రక్రియ మరింత సులభంగా మారనుంది. సత్రంలో మొత్తం 96 విశ్రాంతి గదులు ఏర్పాటు చేయనున్నారు.
Andhra Pradesh
Kondagattu Anjaneya Swamy Temple
Pawan Kalyan
Jana Sena Party
Andhra Pradesh Deputy Chief Minister
Temple Developmentమండపం
అయ్యప్ప మాలధారులు
భక్తుల సౌకర్యాలు
Scroll for the next article