News8th Nov 03:40 PMSunil Byrisetty1 min read

ఎర్రచందనం అడవిలో పవన్ కళ్యాణ్

తిరుపతి జిల్లా, మామండూరు అటవీ ప్రాంతాన్ని ఉపముఖ్యమంత్రిపవన్ కళ్యాణ్ పరిశీలించారు. అడవిలో నాలుగు కిలోమీటర్లు పైగా ప్రయాణించిన పవన్, రెండు కిలోమీటర్ల మేర కాలినడకన నడుస్తూ ప్రతి చెట్ట

ఎర్రచందనం అడవిలో పవన్ కళ్యాణ్
తిరుపతి జిల్లా, మామండూరు అటవీ ప్రాంతాన్ని ఉపముఖ్యమంత్రిపవన్ కళ్యాణ్ పరిశీలించారు. అడవిలో నాలుగు కిలోమీటర్లు పైగా ప్రయాణించిన పవన్, రెండు కిలోమీటర్ల మేర కాలినడకన నడుస్తూ ప్రతి చెట్టునీ పరిశీలించారు. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనబడే అరుదైన మొక్కలు పరిశీలించి అటవీ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. నేపిరయర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి మొత్తం అటవీ ప్రాంతం మొత్తం పరిశీలించారు. వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణ ముఖీ నది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. గుంటి మడుగు వాగు ఒడ్డున కూర్చుని, పరిసరాలను ఆసక్తిగా తిలకించారు. వాగుకి ఇరు వైపులా ఉన్న చెట్ల వివరాలపై ఆరా తీశారు. ఎర్రచందనం స్మగ్లింగ్, స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్, టాస్క్ ఫోర్స్, అటవీ సిబ్బంది కూంబింగ్ తదితర తెలుసుకున్నారు.
Andhra Pradesh
Pawan Kalyan
Tirupati
Mamandur
Sandalwood Forest
Red Sandalwood
Rare Plants
Sheshachalam
Forest Inspection
స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్లు
టాస్క్ ఫోర్స్
అటవీ అధికారులు
Scroll for the next article