News24th Dec 12:00 PMSunil Byrisetty1 min read
ఇప్పటం గ్రామానికి పవన్ కళ్యాణ్
ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. గ్రామంలోని ఇండ్ల నాగేశ్వరమ్మ నివాసానికి వెళ్లి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఇండ్ల నాగేశ్వరమ్మకు రూ. 50 వేల నగదు, దివ్యాంగుడైన
ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. గ్రామంలోని ఇండ్ల నాగేశ్వరమ్మ నివాసానికి వెళ్లి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఇండ్ల నాగేశ్వరమ్మకు రూ. 50 వేల నగదు, దివ్యాంగుడైన ఆమె మనవడికి రూ. లక్ష సాయం అందజేశారు. పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యే జీతం నుంచి రూ. 5 వేలు ప్రతినెల పెన్షన్ రూపంలో నాగేశ్వరమ్మకి ఇస్తామని హామీ ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఇండ్ల నాగేశ్వరమ్మ కుమారుడు కోసం రూ. 3 లక్షల cmrf చెక్ అందజేశారు. భవిష్యత్తులో అండగా ఉంటామని నాగేశ్వరమ్మకు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఇప్పటం గ్రామంలో జనసేన సభకు భూములు ఇచ్చిన వారిని ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ ఆ గ్రామంలో పర్యటించి భరోసా కల్పించారు.