News26th Jul 11:20 AMSunil Byrisetty1 min read

పుష్పా జాగ్రత్త! పవన్ వస్తున్నాడు!!

ఎర్రచందనం అక్రమ రవాణా చేసే పుష్ప ముఠాలకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు మరింత కఠినమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు స్పష

పుష్పా జాగ్రత్త! పవన్ వస్తున్నాడు!!
ఎర్రచందనం అక్రమ రవాణా చేసే పుష్ప ముఠాలకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు మరింత కఠినమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆపరేషన్ అరణ్య ద్వారా ఎర్ర చందనం స్మగ్లింగ్ ను ఏ విధంగా అరికడుతున్నదీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని తెలిపారు. కడప జిల్లా అవధూత కాశినాయన మండల పరిధిలోని వరికుంట్ల గ్రామ సమీపంలోని జ్యోతి గుడి వద్ద రూ.1.5 కోట్ల విలువైన 78 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న ఘటనపై ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం అధికారులతో మాట్లాడారు. ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లతోపాటు వారికి సహకరిస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ను అరెస్టు చేసిన విషయాన్ని ఉప ముఖ్యమంత్రికి అధికారులు తెలియచేశారు.
Andhra Pradesh
Pawan Kalyan
Red Sandalwood
Red Sanders
Smuggling
Operation Aranya
Forest Department
Kadapa
అక్రమ రవాణా
స్మగ్లర్లు
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్
నేర వార్తలు
Scroll for the next article