News24th Jul 12:58 PMSunil Byrisetty1 min read

కుంకీ ఏనుగులకు పవన్‌ స్వాగతం

విజయనగరం, మన్యం జిల్లాల్లో పంటపొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగుల గుంపుని కట్టడి చేసేందుకు కుంకీ ఏనుగుల్ని పంపిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ తెలిపారు. పలమనేరు నుంచి పార్

కుంకీ ఏనుగులకు పవన్‌ స్వాగతం
విజయనగరం, మన్యం జిల్లాల్లో పంటపొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగుల గుంపుని కట్టడి చేసేందుకు కుంకీ ఏనుగుల్ని పంపిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ తెలిపారు. పలమనేరు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు వెళ్తున్న కుంకీ ఏనుగులకు మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద పవన్ స్వాగతం పలికారు. పూలు జల్లి స్వాగతించారు. గజరాజులు జయంత్, అభిమన్యులకు పవన్ కళ్యాణ్ చెరకు గడలను తినిపించారు. పవన్ ను గజరాజులు జయంత్, అభిమన్యు ఆశీర్వదించాయి. అనంతరం ఏనుగులు మన్యం వైపు తరలాయి.
Andhra Pradesh
Pawan Kalyan
Kumki Elephants
Wild Elephants
Human Wildlife Conflict
Vizianagaram
అటవీ శాఖ
పంటల రక్షణ
మానవ వన్యప్రాణి ఘర్షణ
జయంత్
Scroll for the next article