News16th Jul 03:35 PMSunil Byrisetty1 min read
ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్..?
ఈ నెల 26 నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్‌లో పర్యటించనున్నారు. ఆ 4 రోజులపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో
ఈ నెల 26 నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్‌లో పర్యటించనున్నారు. ఆ 4 రోజులపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో వాస్తవమెంత అనేది చూద్దాం. రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి అందుబాటులో లేనప్పుడు తన కేబినెట్‌లోని ఒక మంత్రికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వొచ్చు. ఇది పూర్తిగా ముఖ్యమంత్రి విచక్షణపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పవన్ కల్యాణ్‌కు అలా బాధ్యతలు ఇవ్వాలనుకుంటే అయ్యే అవకాశం ఉంది. రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి అనే పదవిపై ఎలాంటి నిబంధనలు లేవు. ఇది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు ఉప ముఖ్యమంత్రి లేదా ఇతర మంత్రులలో ఒకరు తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టడం అనేది సంప్రదాయంగా వస్తోంది. కనుక పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహిస్తారా అనేది ఊహాగానమే అనుకోవచ్చు. గతంలో దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు వెళ్లినప్పుడు సీఎం చంద్రబాబు తన బాధ్యతలేమీ అప్పగించలేదు. దీంతో అధికారిక ప్రకటన వచ్చేవరకు ఊహగానమే అని చెప్పవచ్చు.