Politics13th Sep 04:57 PMSunil Byrisetty1 min read
మచిలీపట్నం ఘటనపై పవన్ కళ్యాణ్ సూచనలు
జనసైనికులు, కూటమి శ్రేణులు ప్రజల మధ్య విభేదాలు సృష్టించే వారి ఉచ్చులో పడవద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. పదేళ్లుగా కుట్రలు చేసేవారి కుయుక్తులను చూస్తున్నామన్నారు. రెచ్చ
జనసైనికులు, కూటమి శ్రేణులు ప్రజల మధ్య విభేదాలు సృష్టించే వారి ఉచ్చులో పడవద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. పదేళ్లుగా కుట్రలు చేసేవారి కుయుక్తులను చూస్తున్నామన్నారు. రెచ్చగొట్టేలా, అభ్యంతరకరంగా మాట్లాడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఎవరు ఆవేశాలకు లోనై ఘర్షణలకు తావివ్వకూడదని, తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెట్టాలని పవన్ స్పష్టం చేశారు. “వారి దుష్ప్రచారాన్ని ప్రజాస్వామ్య విధానంలోనే, చట్టప్రకారం ఎదుర్కొందాం. సామాజిక మాధ్యమాల్లో అసభ్యంగా మాట్లాడుతున్న వారిని సహించము” అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మచిలీపట్నం ఘటనపై అంతర్గత విచారణ చేయాలని పార్టీ నేతలకు సూచించినట్లు తెలిపారు.