News4th Jul 03:47 PMSunil Byrisetty1 min read

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పవన్ ఫొటో

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పెద్ద కుమారుడు అకీరా నందన్, చిన్న కుమారుడు మార్క్ శంకర్‌లతో కలిసి మంగళగిరిలోని తన నివాసానికి చేరుకున్నారు. పవన్ తన ఇద్దరు కుమారులతో కలిసి ఉన్న ఫొట

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పవన్ ఫొటో
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పెద్ద కుమారుడు అకీరా నందన్, చిన్న కుమారుడు మార్క్ శంకర్‌లతో కలిసి మంగళగిరిలోని తన నివాసానికి చేరుకున్నారు. పవన్ తన ఇద్దరు కుమారులతో కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. అభిమానులు ‘తండ్రీ తనయులు’ అనే క్యాప్షన్‌తో ఈ ఫొటోను షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంతో కాసేపు గడిపిన వెంటనే పవన్ కల్యాణ్ తన అధికారిక విధుల్లో నిమగ్నమయ్యారు. అనంతరం ఆయన మార్కాపురం నియోజకవర్గ పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో జలజీవన్‌ మిషన్‌లో భాగంగా రూ.1,290 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న తాగునీటి పథకానికి పవన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
Andhra Pradesh
Deputy CM Pawan Kalyan
Mark Sankar
akira nandan
viral photo
పవన్ కళ్యాణ్ గారు పెద్ద కుమారుడు అకీరా నందన్
చిన్న కుమారుడు మార్క్
Scroll for the next article