News1st Jan 12:30 PMSunil Byrisetty1 min read

గిరిజన మహిళలకు పవన్ న్యూ ఇయర్ గిఫ్ట్

కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని మన్యం ప్రాంత గిరిజనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గిఫ్ట్ ఇచ్చారు. గిరిజన మహిళలను గర్భస్రావాలు, రక్తహీనత వంటి ప్రాణాంతక సమస్యల నుంచి కాపాడే లక్ష

గిరిజన మహిళలకు పవన్ న్యూ ఇయర్ గిఫ్ట్
కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని మన్యం ప్రాంత గిరిజనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గిఫ్ట్ ఇచ్చారు. గిరిజన మహిళలను గర్భస్రావాలు, రక్తహీనత వంటి ప్రాణాంతక సమస్యల నుంచి కాపాడే లక్ష్యంతో అరకులోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఆధునిక బ్లడ్ బ్యాంక్ భవనం నిర్మించనున్నట్లు వెల్లడించారు. 'అడవితల్లి బాట' కార్యక్రమం ప్రారంభోత్సవానికి గత ఏప్రిల్‌లో పవన్ కల్యాణ్ వెళ్లిన సందర్భంగా కురిడీ గ్రామంలో గిరిజనులతో ముఖాముఖి నిర్వహించారు. ఆ సమయంలో ఒక గిరిజన మహిళ రక్తహీనత కారణంగా గిరిజనులు ఎదుర్కొంటున్న తీవ్ర ఆరోగ్య సమస్యలను పవన్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా జన్యుపరంగా వచ్చే సికిల్ సెల్ అనీమియా వ్యాధి గర్భిణుల ప్రాణాలకు ముప్పుగా మారుతోందని వివరించారు. ఈ నేపథ్యంలో వారికినూతన సంవత్సర కానుకగా బ్లడ్ బ్యాంక్ భవన నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ భవనంలో అవసరాలకు అనుగుణంగా రక్తాన్ని నిల్వ చేసుకునేందుకు అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అవసరమైన నిధులను పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు దాతలు సమకూర్చనున్నారు.
Andhra Pradesh
Pawan Kalyan
Andhra Pradesh
Tribal Welfare
Araku Valley
Blood Bank
New Year Gift
Women Health
Sickle Cell Anemia
మన్యం ప్రాంతం
వైద్యాభివృద్ధి
అడవితల్లి బాట
Scroll for the next article