News22nd Sep 05:33 PMSunil Byrisetty1 min read

పవన్ పర్యటన.. జనసైనికుల అసంతృప్తి!

నెలరోజుల సుదీర్ఘ విరామం తర్వాత ఏపీకి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించారు. అయితే ప్రకటించిన పూర్తి షెడ్యూల్‌ను పూర్తి చేయలేకపోయారు. రూ.1,500

పవన్ పర్యటన.. జనసైనికుల అసంతృప్తి!
నెలరోజుల సుదీర్ఘ విరామం తర్వాత ఏపీకి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించారు. అయితే ప్రకటించిన పూర్తి షెడ్యూల్‌ను పూర్తి చేయలేకపోయారు. రూ.1,500 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు షెడ్యూల్ లో ఉండగా.. అనేక కార్యక్రమాలు రద్దయ్యాయి. పిఠాపురం మండలం ఫకృద్దీన్‌పాలెంలోని మైసమ్మ చెరువును, పట్టణంలోని పీఠికాపుర వనాన్ని పవన్ కల్యాణ్ ప్రారంభించారు. అనంతరం ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి వెళ్లారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం కొత్తపల్లి మండలం కొండెవరం, నాగులపల్లిలోని సమగ్ర రక్షిత మంచినీటి పథకాలను పవన్‌ కల్యాణ్‌ ప్రారంభించాల్సి ఉంది. ఆ దిశగా అధికారులు వారం రోజులుగా ఏర్పాట్లు కూడా చేశారు. కానీ, ఆ కార్యక్రమాలు జరగలేదు. చాలా కాలం తర్వాత పవన్ కల్యాణ్ పిఠాపురం రావడంతో జనసేన నాయకులు, కార్యకర్తలు ఎదురుచూశారు. అయితే పర్యటనలో స్థానిక నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యం దక్కలేదనే అసంతృప్తి వ్యక్తమైంది.
Scroll for the next article