News7th Nov 10:49 AMSunil Byrisetty1 min read

రేపటి నుంచి తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ రెండు రోజులపాటు తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ నెల 8వ తేదీ తిరుపతి జిల్లా పరిధిలోని ఎర్రచందనం డిపోని సందర

రేపటి నుంచి తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ రెండు రోజులపాటు తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ నెల 8వ తేదీ తిరుపతి జిల్లా పరిధిలోని ఎర్రచందనం డిపోని సందర్శిస్తారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ లో ఎర్రచందనం అక్రమ రవాణా, స్మగ్లింగ్ నిరోధంపై టాస్క్ ఫోర్స్, అటవీ శాఖ అధికారులతో నిర్వహించే సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. 9వ తేదీ పలమనేరులోని కుంకీ ఏనుగుల క్యాంపును సందర్శిస్తారు. కుంకీ ఏనుగుల సంరక్షణతోపాటు – ఏనుగులు, మనుషుల మధ్య సంఘర్షణ నియంత్రణకు అనుసరిస్తున్న నూతన సాంకేతిక విధానాలను పరిశీలిస్తారు.
Andhra Pradesh Deputy CM
Pawan Kalyan
Tirupati
Chittoor
Forest Department
Red Sandalwood
Smuggling Prevention
టాస్క్ ఫోర్స్ సమావేశం
కుంకీ ఏనుగులు
వన్యప్రాణి సంరక్షణ
Scroll for the next article