News8th Apr 10:57 AMSunil Byrisetty1 min read
పవన్ కుమారుడికి ప్రమాదం.. సింగపూర్‌కు పయనం
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమ
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు.
మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి.
ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఇబ్బందులకు లోనయ్యాడు.
మార్క్ శంకర్‌ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
ఈ విషయం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్‌కి తెలిసింది.
పర్యటన నిలుపుదల చేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు, నాయకులు సూచించారు.
‘అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని… కాబట్టి ఆ గ్రామం వెళ్ళి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకొంటాన’ని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని తెలిపారు.
మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ కల్యాణ్ విశాఖ చేరుకుంటారు.
అక్కడి నుంచి సింగపూర్ వెళ్ళనున్నారు.