News12th Dec 04:14 PMSunil Byrisetty1 min read
అంధుల క్రికెట్ జట్టుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ
ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో క్రికెటర్లు, శిక్షకులు, సహాయక సిబ్బంది ఈ భేట
ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో క్రికెటర్లు, శిక్షకులు, సహాయక సిబ్బంది ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచ కప్ సాధించిన క్రికెటర్లను పవన్ అభినందించారు. ఒక్కో క్రికెటర్ కీ రూ.5 లక్షల చొప్పున చెక్ ప్రదానం చేశారు. శిక్షకులకు రూ.2 లక్షలు చొప్పున చెక్కులు అందించారు. ప్రతి మహిళ క్రికెటర్ కీ పట్టు చీర, శాలువాతోపాటు జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతులను అందించి సత్కరించారు. మహిళా అంధ క్రికెటర్లు సాధించిన విజయం దేశానికే గర్వకారణమని పవన్ కళ్యాణ్ కొనియాడారు. అంధ క్రికెటర్ల ప్రాక్టీస్ కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని, అన్ని విధాలా అండగా నిలవాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా విజ్ఞప్తి చేస్తానని హామీ ఇచ్చారు.