News21st Mar 04:05 PMSunil Byrisetty1 min read
ఉద్యోగులకు రూ.6,200 కోట్ల బకాయిల విడుదల
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు తీపి కబురు అందించారు. సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాటి కోసం ఉద్యోగులు నిరీక్షిస్తున్నారు. పలుమ
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు తీపి కబురు అందించారు.
సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాటి కోసం ఉద్యోగులు నిరీక్షిస్తున్నారు.
పలుమార్లు గత ప్రభుత్వంలో విజ్ఞప్తులూ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
ఆ ప్రకారం వారికి రూ.6,200 కోట్ల CPS, GPF, APGAI బకాయిలు చెల్లించాలని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
దీంతో ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 11న దాదాపు రూ.1,033 కోట్ల బకాయిలను చెల్లించిన విషయం తెలిసిందే.