News30th Nov 09:29 AMSunil Byrisetty1 min read
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యార్థి వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి
కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను సమరశీల పోరాటాలతో తిప్పికొట్టాలని PDSU జాతీయ కన్వీనర్ ఎం. రామకృష్ణ పిలుపునిచ్చా
కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను సమరశీల పోరాటాలతో తిప్పికొట్టాలని PDSU జాతీయ కన్వీనర్ ఎం. రామకృష్ణ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలో జరుగుతున్న పీడీఎస్యు 24వ రాష్ట్ర మహాసభలలో రామకృష్ణ మాట్లాడుతూ పాఠశాల నుంచి యూనివర్సిటీ వరకు విద్యార్థులు సమస్యలతో సతమతం అవుతున్నారని అన్నారు. పాలకులు మాటల్లోనే తప్ప ఆచరణలో విద్యార్థుల గోడు పట్టించు కోవడం లేదని విమర్శించారు. ప్రతి సంవత్సరం విద్యారంగానికి నిధులు కోత విధించడమే కాకుండా విద్యార్ధులపై తీవ్ర భారాల్ని మోపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం అయ్యిందని విమర్శించారు. పాఠశాల విద్యను 9 రకాల పాఠశాలలుగా మార్చి వేసి అగమ్యగోచరంగా మార్చివేసిందని అన్నారు. యువగళం పాద యాత్రలో లోకేష్ ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయని ఎద్దేవా చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, హక్కుల కోసం పోరాడాలని రామకృష్ణ అన్నారు. PDSO రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.