Education14th Sep 06:07 PMSunil Byrisetty1 min read

ప్ర‌శాంతంగా సీడీఎస్‌, ఎన్‌డీఏ-ఎన్ఏ ప‌రీక్ష‌లు

ఆదివారం విజ‌య‌వాడ‌లోని ఆరు కేంద్రాల్లో నిర్వ‌హించిన యూపీఎస్సీ - నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీ అండ్ నేవ‌ల్ అకాడ‌మీ (2), కంబైన్డ్ డిఫెన్స్ అకాడ‌మీ (2) ప‌రీక్ష‌లు ప్ర‌శాంతంగా ముగిశాయి. జి

ప్ర‌శాంతంగా సీడీఎస్‌, ఎన్‌డీఏ-ఎన్ఏ ప‌రీక్ష‌లు
ఆదివారం విజ‌య‌వాడ‌లోని ఆరు కేంద్రాల్లో నిర్వ‌హించిన యూపీఎస్సీ - నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీ అండ్ నేవ‌ల్ అకాడ‌మీ (2), కంబైన్డ్ డిఫెన్స్ అకాడ‌మీ (2) ప‌రీక్ష‌లు ప్ర‌శాంతంగా ముగిశాయి. జిల్లా అధికారులు బిష‌ప్ అజ‌ర‌య్య బాలిక‌ల జూనియ‌ర్ క‌ళాశాల‌, ఎస్ఆర్ఆర్‌-సీవీఆర్ క‌ళాశాల‌ల్లోని ప‌రీక్షా కేంద్రాల‌ను త‌నిఖీ చేశారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా అభ్య‌ర్థుల‌కు చేసిన ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. సీడీఎస్ ప‌రీక్ష‌కు సంబంధించి 672 మందికి, ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ ప‌రీక్ష‌కు సంబంధించి 718 మంది అభ్య‌ర్థుల‌కు ఏర్పాట్లు చేయ‌గా.. సీడీఎస్ ప‌రీక్ష మూడు షిఫ్ట్‌ల్లోనూ, ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ ప‌రీక్ష రెండు షిఫ్ట్‌ల్లో జ‌రిగింది. సీడీఎస్ ప‌రీక్ష మొదటి షిఫ్ట్‌లో 52.7 శాతం, రెండో షిఫ్ట్‌లో 53.1 శాతం, మూడో షిఫ్ట్‌లో 53.6 శాతం హాజ‌రు న‌మోదు కాగా ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ మొద‌టి షిఫ్ట్‌లో 62.8 శాతం, రెండో షిఫ్ట్‌లో 62.7 శాతం హాజ‌రు నమోదైంది. ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌లో భాగ‌స్వాములైన లైజ‌నింగ్‌, సూప‌ర్‌వైజింగ్ త‌దిత‌ర అధికారుల‌తో పాటు రెవెన్యూ, పోలీస్‌, వైద్య ఆరోగ్యం, విద్యుత్‌, ప్ర‌జా ర‌వాణా, పోస్ట‌ల్ త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌కు అభినంద‌న‌లు తెలిపారు.
Andhra Pradesh
UPSC
CDS Exam
NDA Exam
NA Exam
Vijayawada
UPSC Exams
Defence Careers
CDS 2025
NDA 2025
Exam Updates
Scroll for the next article