Politics28th Apr 01:21 PMSunil Byrisetty1 min read

జీవీఎంసీ మేయర్‌గా పీలా, గుంటూరు మేయర్‌గా రవీంద్ర

కూటమి ఖాతాలో విశాఖ, గుంటూరు మేయర్లు చేరాయి. జీవీఎంసీ మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పీలా శ్రీనివాసరావుకు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ధ్రువపత్రం అందించారు. పీ

జీవీఎంసీ మేయర్‌గా పీలా, గుంటూరు మేయర్‌గా రవీంద్ర
కూటమి ఖాతాలో విశాఖ, గుంటూరు మేయర్లు చేరాయి. జీవీఎంసీ మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పీలా శ్రీనివాసరావుకు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ధ్రువపత్రం అందించారు. పీలా శ్రీనివాసరావు పేరును జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ప్రతిపాదించారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరచారు. గుంటూరు నూతన మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర గెలుపొందారు. కూటమి అభ్యర్థిగా రవీంద్రకు 34 ఓట్లు పోలయ్యాయి. బరిలో ఉన్న అచ్చాల వెంకట రెడ్డికి 27 ఓట్లు మాత్రమే దక్కడంతో కోవెలమూడి రవీంద్ర గెలిచినట్లు ఎన్నికల అధికారి భార్గవ్ తేజ్ ప్రకటించారు.
Andhra Pradesh
Kovelamudi Ravindra
Peela Srinivasa Elected as GVMC Mayor
Guntur
ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్
రవీంద్రకు 34 ఓట్లు
అచ్చాల వెంకట రెడ్డికి 27 ఓట్లు
Scroll for the next article