News13th Oct 11:28 AMSunil Byrisetty1 min read

ఏపీలో ‘పెలికాన్‌ వ్యాలీ’ పేరుతో కొత్త ఐటీ పార్క్

రాయలసీమ ప్రాంతంలో కొత్త ఐటీ పార్క్ దిశగా అడుగులుపడుతున్నాయి. అమెరికాలోని ఐటీ, ఆర్థిక రంగాల నిపుణులు, 20 ఏళ్ల క్రితం ఉపాధి కోసం అమెరికా వెళ్లి స్థిరపడిన సుమారు 20 మంది ఎన్ఆర్ఐలు రాష

ఏపీలో ‘పెలికాన్‌ వ్యాలీ’ పేరుతో కొత్త ఐటీ పార్క్
రాయలసీమ ప్రాంతంలో కొత్త ఐటీ పార్క్ దిశగా అడుగులుపడుతున్నాయి. అమెరికాలోని ఐటీ, ఆర్థిక రంగాల నిపుణులు, 20 ఏళ్ల క్రితం ఉపాధి కోసం అమెరికా వెళ్లి స్థిరపడిన సుమారు 20 మంది ఎన్ఆర్ఐలు రాష్ట్రంపై ప్రేమతో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు ముందుకు వచ్చారు. అందుకే తిరుపతి జిల్లా దొరవారిసత్రం దగ్గర ‘పెలికాన్‌ వ్యాలీ’ పేరుతో సుమారు రూ.250 కోట్ల సొంత నిధులతో ఐటీ పార్కును ఏర్పాటు చేయనున్నారు. ఈ పార్కును 2026లో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఐటీ పార్కు ఏర్పాటుకు అవసరమైన అనుమతుల కోసం వివిధ విభాగాలకు దరఖాస్తులు చేశామని ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతినిధులు తెలిపారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో, ‘వాక్‌ టు వర్క్‌’ విధానంలో ఈ ఐటీ పార్కును అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. రెండు దశల్లో కలిపి మొత్తం 50 ఎకరాల్లో ఈ పార్కును అభివృద్ధి చేయాలని ప్లాన్ చేశారు. నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రానికి సమీపంలో ఈ ఐటీ పార్కును ఏర్పాటు చేస్తున్నందున దీనికి ‘పెలికాన్‌ వ్యాలీ’ అని పేరు పెట్టామంటున్నారు.
Andhra Pradesh
Pelican Valley
IT Park
Rayalaseema
Tirupati
NRIs
Investment
Employment
Tech Development
Walk to Work
Infrastructure
Pelican Sanctuary
మౌలిక వసతులు
పెలికాన్ సంరక్షణ కేంద్రం
Scroll for the next article