News11th Aug 05:50 PMSunil Byrisetty1 min read
త్వరలోనే టిడ్కో ఇళ్ల పెండింగ్ పనులు పూర్తి
ఉయ్యూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జంపాన గుర్నాధం ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నా
ఉయ్యూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జంపాన గుర్నాధం ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఉయ్యూరు లోని 2వ,వార్డు లో ఇంటింటికి వెళ్లి స్థానిక సమస్యలను తెలుసుకుని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గూర్చి వివరించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న టిడ్కో ఇళ్ల నిర్మాణం దశల వారీగా ప్రారంభించిందని వివరించారు. ఉయ్యూరు పట్టణంలోని టిడ్కో ఇళ్లను మొదటి దశలోనే త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌తో కలిసి పట్టణాభివృద్ధి మంత్రి నారాయణకు విజ్ఞప్తి చేస్తామని అన్నారు. త్వరలోనే పేదవారి సొంతింటి కల నెరవేరుతుందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.