News1st Sep 10:05 AMSunil Byrisetty1 min read

ఏలూరులో జోరుగా పింఛన్లు

ఏలూరు నగరంలోని మినీ బైపాస్ రోడ్డు, రామకృష్ణాపురంలో ఎన్.టి.ఆర్. భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) తో కలిసి జిల్లా కలెక్టర్ కె.వెట

ఏలూరులో జోరుగా పింఛన్లు
ఏలూరు నగరంలోని మినీ బైపాస్ రోడ్డు, రామకృష్ణాపురంలో ఎన్.టి.ఆర్. భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) తో కలిసి జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి పింఛన్లు పంపిణీ చేశారు. పించనుదారులతో మాట్లాడి వారి యోగక్షేమాలను, కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఇంటివద్దకే వచ్చి పెన్షన్లు అందజేయడంపట్ల లబ్దిదారులు తమ సంతోషం వ్యక్తంచేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్వాంగులు, వ్యాధిగ్రస్ధులకు ప్రభుత్వం పింఛన్లను పెద్దమొత్తంలో పెంచి అండగా నిలిచిందని లబ్దిదారులకు వివరించారు. సెప్టెంబర్ మాసపు ఎన్.టి.ఆర్. భరోసా పించన్లు అందించే క్రమంలో జిల్లాలో ఉన్న 2,61,221 మంది పించను దారులకు ప్రభుత్వం రూ. 114.13 కోట్లు విడుదల చేసిందన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన పింఛన్లు ఏదైనా కారణం చేత తీసుకోని వారికి సెప్టెంబరు 2వ తేదీ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
Andhra Pradesh Government
Eluru Pensions
NTR Bharosa
Social Welfare
Badeti Radhakrishnaiah
K. Vetriselvi
ఏలూరు పింఛన్లు
ఎన్టీఆర్ భరోసా
సామాజిక పింఛన్లు
Scroll for the next article