News25th Sep 09:25 AMSunil Byrisetty1 min read

బ్యాంకుల సమ్మె ఉన్నా సమయానికే పింఛను

రాష్ట్రంలో 61.80 లక్షల మంది పింఛనుదారులకు అక్టోబ‌ర్ 1న‌ పింఛన్లు అంద‌జేసేందుకు ప్ర‌భుత్వం రూ.2,692.34 కోట్ల విడుదల చేసింద‌ని మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ తెలిపారు. విడుదల చేసే మొత

బ్యాంకుల సమ్మె ఉన్నా సమయానికే పింఛను
రాష్ట్రంలో 61.80 లక్షల మంది పింఛనుదారులకు అక్టోబ‌ర్ 1న‌ పింఛన్లు అంద‌జేసేందుకు ప్ర‌భుత్వం రూ.2,692.34 కోట్ల విడుదల చేసింద‌ని మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ తెలిపారు. విడుదల చేసే మొత్తం నిధుల్లో రూ.2,675.63 కోట్లను సంబంధిత స్వర్ణ గ్రామం / స్వర్ణ వార్డు పింఛను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తార‌ని.. రూ.16.65 కోట్లను పింఛనుదారుల బ్యాంకు ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా నేరుగా జమ చేస్తారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, SNA SPARSH విధానం ద్వారా ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాల్లో నేరుగా DBT ద్వారా పింఛన్లను జమ చేసే ప్రక్రియను విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలో పైలట్ ప్రాతిపదికన అమలు చేస్తున్న‌ట్టు మంత్రి పేర్కొన్నారు. ఇందుకోసం ఈ మండలంలోని NSAP పింఛనుదారుల ఖాతాల్లో రూ.0.06 కోట్లు నేరుగా జమ కానున్న‌ట్టు మంత్రి కొండ‌ప‌ల్లి తెలిపారు. సెప్టెంబర్ 26వ తేదీ శనివారం బ్యాంకు సెలవు కావడం, అలాగే సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె ఉన్న నేపథ్యంలో పింఛనుదారులకు ఎలాంటి అవస్థలు కలగకుండా ప్రభుత్వం ముందస్తుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన‌ట్టు మంత్రి తెలిపారు. ఈ మేరకు అక్టోబర్ 1వ తేదీ ఉదయమే పింఛన్ల పంపిణీకి అవసరమైన నగదును విత్‌డ్రా చేసుకునేలా బ్యాంకులను అందుబాటులో ఉంచాలని SLBC (రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి)కి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. స్వర్ణ గ్రామం / స్వర్ణ వార్డు సిబ్బంది అక్టోబర్ 1వ తేదీ ఉదయం బ్యాంకుల నుండి నగదును విత్‌డ్రా చేసి.. అదే రోజు మ‌ధ్యాహ్నం నుంచే నేరుగా ఫించ‌న్‌దారుల ఇళ్ల‌వ‌ద్ద‌కే వెళ్లి పింఛ‌న్లు పంపిణీ చేస్తార‌ని మంత్రి కొండ‌ప‌ల్లి స్ప‌ష్టం చేశారు.
Scroll for the next article