News30th Oct 04:17 PMSunil Byrisetty1 min read
అమ్మవారి పేరుతో వాసవీ పెనుగొండగా నామకరణం
అమరావతిలో పొట్టి శ్రీరాముల స్మారక స్మతివనం ఏర్పాటుకు 6.8 ఎకరాల కేటాయించారని మంత్రి సవిత తెలిపారు. ఇటీవల ఆర్యవైశ్యుల కులదైవం కన్యకాపరమేశ్వరి అమ్మవారికి ఆత్మార్పణ దినోత్సవం రోజున ప్ర
అమరావతిలో పొట్టి శ్రీరాముల స్మారక స్మతివనం ఏర్పాటుకు 6.8 ఎకరాల కేటాయించారని మంత్రి సవిత తెలిపారు. ఇటీవల ఆర్యవైశ్యుల కులదైవం కన్యకాపరమేశ్వరి అమ్మవారికి ఆత్మార్పణ దినోత్సవం రోజున ప్రభుత్వ తరఫున అధికారికంగా పట్టు వస్త్రాల సమర్పించారన్నారు. కన్యకాపరమేశ్వరి అమ్మవారు జన్మించిన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామానికి వాసవీ పెనుగొండ గ్రామంగా త్వరలో పేరు మార్చనున్నామని, ఈ మేరకు త్వరలో జీవో రానుందని తెలిపారు. దామాషా ప్రకారం ఆర్యవైశ్యులకు పదవుల కేటాయిస్తున్నామన్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాలు అందజేయబోతున్నామన్నారు. వివిధ పేర్లతో సంభోదిస్తున్న ఆర్యవైశ్యులను ఒకే గొడుగు తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నామని, ఇదే విషయం ఇప్పటికే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని మంత్రి సవిత వెల్లడించారు. ఆర్య, శెట్టి, గుప్త, కోమటి, వేగిన, బుక్క, జనపశెట్టి...ఇలా వివిధ పేర్లతో పిలుస్తున్న వైశ్యులందరినీ ఆర్యవైశ్యులుగా గుర్తిస్తూ చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని మంత్రి సవిత హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేశ్, భగవాన్ నారాయణ, చిన్ని రామసత్యనారాయణ, కె.రజనీ, తల్లం సత్యనారాయణ, వీవీకే నర్సింహారావు, కోనా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.