News29th Nov 12:17 PMSunil Byrisetty1 min read
శరవేగంగా పెనుమాక రిజర్వాయర్ నిర్మాణ పనులు
అమరావతి రాజధాని ప్రాంతంలో కొండవీటి వాగు, పాలవాగు, పొట్టేళ్ల వాగు కారణంగా సంభవిస్తున్న వరద ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వాయర్ల పనులను చేపట్ట
అమరావతి రాజధాని ప్రాంతంలో కొండవీటి వాగు, పాలవాగు, పొట్టేళ్ల వాగు కారణంగా సంభవిస్తున్న వరద ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వాయర్ల పనులను చేపట్టింది. అందులో భాగంగా తాడేపల్లి మండలం పెనుమాకలో సుమారు 190 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ. 315 కోట్ల వ్యయంతో 0.1 టీఎంసీ నీటిని నిల్వ చేసేందుకు చేపట్టిన రిజర్వాయర్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అమరావతి రాజధాని ప్రాంతం లోని శాఖమూరులో సుమారు 50 ఎకరాల్లో 0.03 టీఎంసీ నీటిని నిల్వ చేసే రిజర్వాయర్ ను, నీరు కొండలో సుమారు 450 ఎకరాల్లో 0.4 టీఎంసీ నీటి నిల్వ చేసే రిజర్వాయర్లను దాదాపుగా పూర్తి చేశారు. కొండవీటి వాగు -పాలవాగు కలిసే ప్రాంతం పెనుమాక లో చేపట్టిన రిజర్వాయర్ నిర్మాణ పనులు చకచకా సాగుతోన్నాయి. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి ఈ రిజర్వాయర్ నిర్మాణ పనులు కూడా దాదాపుగా పూర్తి కానున్నాయి. రిజర్వాయర్ల నిర్మాణం ద్వారా అమరావతి రాజధానిని వరద ముంపు నుంచి రక్షించడంతోపాటు రాజధాని ప్రాంత ప్రజల నీటి అవసరాలు సైతం తీరను న్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.