News8th Oct 11:49 AMSunil Byrisetty1 min read
జీఎస్టీ 2.0తో ప్రజలు ఫుల్ హ్యాపీ
జీఎస్టీ 2.0 సంస్కరణలతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు కలుగుతోందని, ధరల తగ్గులపై ప్రజలు ఫుల్ హ్యాపీగా ఉన్నారని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు
జీఎస్టీ 2.0 సంస్కరణలతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు కలుగుతోందని, ధరల తగ్గులపై ప్రజలు ఫుల్ హ్యాపీగా ఉన్నారని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. జీఎస్టీ సంస్కరణలతో రాష్ట్ర ఖజానాపై రూ.8 వేల కోట్ల మేర భారం పడినా పేదలకు మేలు కలుగుతోందన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు సంస్కరణలను స్వాగతించారన్నారు. పెనుకొండ పట్టణంలో జీఎస్టీ 2.0 సంస్కరణలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు దుకాణాలను సందర్శించారు. నిత్యావసర, ఇతర వస్తువుల ధరల తగ్గుదలపై వినియోగదారులతోనూ ముచ్చటించారు. ఇంటింటికీ వెళ్లి జీఎస్టీ తగ్గుదలపై మంత్రి సవిత అవగాహన కల్పించారు. అనంతరం తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో మేలు కలుగుతోందన్నారు. ముఖ్యంగా నిత్యావసరాలు, ఇన్స్యూరెన్స్, మెడికల్, దుస్తులు వంటి ప్రధాన వస్తువులపై జీఎస్టీ తగ్గడం వల్ల ఆర్థికంగా ఎంతో లబ్ధి కలుగుతోందన్నారు. రూ.5 వేల విలువ చేసే నిత్యావసరాలపై రూ.1200ల వరకూ ధరలు తగ్గాయన్నారు. ధరల తగ్గుదలపై పేదలు, మధ్య తరగతి ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోందన్నారు.