News25th Oct 04:05 PMSunil Byrisetty1 min read

జగన్‌ను ఓడించి విశాఖను కాపాడారు!

ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి విశాఖకు ఏం చేశారో చెప్పుకోలేని స్థితిలో వైసీపీ నాయకులు ఉన్నారని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపో

జగన్‌ను ఓడించి విశాఖను కాపాడారు!
ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి విశాఖకు ఏం చేశారో చెప్పుకోలేని స్థితిలో వైసీపీ నాయకులు ఉన్నారని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే నేడు సేవ్ వైజాగ్ పేరుతో కొత్త డ్రామా మొదలుపెట్టారని వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల్లో జగన్ ని, వైసీపీని ఓడించి విశాఖను ప్రజలే కాపాడుకున్నారని పేర్కొన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో విశాఖ నగరాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధికి దూరం చేశారని తెలిపారు. మేం గూగుల్ తీసుకొచ్చి ప్రోత్సహిస్తే... జగన్ రెడ్డి గంజాయి మాఫియాను ప్రోత్సహించారని విమర్శించారు. విశాఖ రైల్వే జోన్‌కు జగన్ అడ్డుపడితే.. మేం అవసరమైన స్థలం కేటాయించి విశాఖ రైల్వే జోన్ సాధించామని గంటా శ్రీనివాసరావు అన్నారు.
Scroll for the next article