News20th Aug 05:00 PMSunil Byrisetty1 min read

గ్రామీణ ఆరోగ్య కేంద్రాలకు శాశ్వత భవన నిర్మాణాలు

రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు పీహెచ్‌సీలు, అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లకు సొంత భవనాల నిర్మాణాల పనులను ప్రభుత్వం వేగవంతం

గ్రామీణ ఆరోగ్య కేంద్రాలకు శాశ్వత భవన నిర్మాణాలు
రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు పీహెచ్‌సీలు, అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లకు సొంత భవనాల నిర్మాణాల పనులను ప్రభుత్వం వేగవంతం చేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలకు తొలి కేంద్రాలుగా ఉన్న విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌, ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాలను పటిష్టం చేయడంతోపాటు పట్టణ ప్రాంతాల్లో అర్బన్‌ పీహెచ్‌సీలకు శాశ్వత భవనాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. శాసన సభలో గురువారం జ‌రిగిన‌ ప్రశ్నోత్తరాల సమయంలో ప‌లువురు సభ్యుల ప్రశ్నలకు మంత్రి సత్యకుమార్ జవాబులిచ్చారు. రాష్ట్రంలో పీహెచ్‌సీలకు సంబంధించి భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించామ‌ని మంత్రి తెలిపారు.
Andhra Pradesh
AP Government
Health Department
Satya Kumar Yadav
Rural Health Centres
Primary Health Centres
PHCs
Village Health Clinics
ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు
ఆరోగ్య మౌలిక వసతులు
వైద్య సేవలు
ఆరోగ్య కేంద్రాలు
గ్రామీణ ఆరోగ్యం
Scroll for the next article