News3rd Aug 03:22 PMSunil Byrisetty1 min read

శాశ్వత తాగునీటి పరిష్కారమే లక్ష్యం

అద్దంకి పట్టణ ప్రజలకు దీర్ఘకాలికంగా తాగునీరు అందించే లక్ష్యంతో రక్షిత మంచినీటి పథకం పనులను వేగవంతం చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. సంతమాగులూరు మండలంలో పబ

శాశ్వత తాగునీటి పరిష్కారమే లక్ష్యం
అద్దంకి పట్టణ ప్రజలకు దీర్ఘకాలికంగా తాగునీరు అందించే లక్ష్యంతో రక్షిత మంచినీటి పథకం పనులను వేగవంతం చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. సంతమాగులూరు మండలంలో పబ్లిక్ హెల్త్ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి కుమారు సమీక్ష సమావేశం నిర్వహించారు. రక్షిత మంచినీటి పథకం పురోగతి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అద్దంకి పట్టణం పరిధిలో రక్షిత మంచినీటి పథకం కోసం ఇప్పటికే రూ.101.96 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభమైనట్లు అధికారులు మంత్రికి వివరించారు. ప్రజలకు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరా ఉండేలా 51 లక్షల లీటర్ల సామర్థ్యం గల నీటి నిల్వ ట్యాంకులను నిర్మించాలని మంత్రి ఆదేశించారు. అలాగే 83 కిలోమీటర్ల మేర నీటి సరఫరా పైప్‌లైన్, 15 కిలోమీటర్ల ఫీడర్ ఛానెల్ నిర్మాణాన్ని నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని సూచించారు. ప్రతి రోజు 12 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేసి పంపిణీ చేసే సామర్థ్యంతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని చెప్పారు.
Andhra Pradesh
Addanki
Gottipati Ravikumar
Drinking Water
Protected Water Scheme
నీటి సరఫరా
మౌలిక వసతులు
వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్
ఏపీ ప్రభుత్వం
Scroll for the next article