News9th May 11:11 AMSunil Byrisetty1 min read
99 పైసలకే భూకేటాయింపుపై హైకోర్టులో పిల్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత విలువైన రూ. 529 కోట్ల ప్రభుత్వ భూమిని కేవలం 99 పైసలకు టిసిఎస్ సంస్థకు అమ్మడంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. టిసిఎస్‌కు 21.16 ఎక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత విలువైన రూ. 529 కోట్ల ప్రభుత్వ భూమిని కేవలం 99 పైసలకు టిసిఎస్ సంస్థకు అమ్మడంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. టిసిఎస్‌కు 21.16 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని జీవో 7 ద్వారా ప్రభుత్వం కేటాయించింది.
నిబంధనలకు వ్యతిరేకంగా భూ కేటాయింపు జరగటంతో జై భీమ్రావు భారత్ పార్టీ కార్యదర్శి నక్క నిమ్మి గ్రేస్ పిల్ వేశారు.
ఏపీఐఐసీ ల్యాండ్ అలాట్మెంట్ రెగ్యులేషన్స్ 2023కు విరుద్ధంగా భూ కేటాయింపు జరిగిందని పిటిషనర్ పేర్కొన్నారు.
క్విడ్ ప్రోకో విధానంతో భూ కేటాయింపు జరిగిందన్నారు.
తక్షణమే ఈ జీవోను సస్పెండ్ చేస్తూ లీస్ పద్ధతుల్లో మాత్రమే భూ కేటాయింపు జరగాలని పిటిషనర్ అభ్యర్థించారు.