News7th Apr 07:12 PMSunil Byrisetty1 min read
పెట్రోల్ ధరల పెంపు.. వినియోగదారుడిపై లేని భారం!
చాలా రోజులుగా నిలకడగా ఉన్న పెట్రోల్ ధరలను కేంద్రం మళ్లీ పెంచింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని 2 రూపాయలు పెంచింది. ఈ పెంపు మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది.
చాలా రోజులుగా నిలకడగా ఉన్న పెట్రోల్ ధరలను కేంద్రం మళ్లీ పెంచింది.
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని 2 రూపాయలు పెంచింది.
ఈ పెంపు మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.10.7.66, డీజిల్ ధర రూ.95.82గా ఉంది.
ఎక్సైజ్ డ్యూటీ పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82కు చేరనుంది.
ఇక విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.76, డీజిల్ ధర రూ.97.51గా ఉంది.
పెరిగిన ఎక్సైజ్ డ్యూటీతో పెట్రోల్ ధర రూ.111.76, డీజిల్ ధర రూ.99.51 కానుంది.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరల తగ్గింపు నేపథ్యంలో ఇప్పటికైనా పెట్రోల్ ధరలు తగ్గుతాయేమోనని ఎదురుచూస్తుండగా ఎక్సైజ్ డ్యూటీ పెంచింది.
అయితే పెట్రో ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
ప్రజలపై పెట్రోల్ ధరల పెంపు భారం ఉండదని, ఎక్సైజ్ సుంకాన్ని ఆయిల్ కంపెనీలే భరిస్తాయని స్పష్టతనిచ్చింది.
పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని కేంద్రం ప్రకటించింది.