News16th Dec 03:29 PMSunil Byrisetty1 min read
ఏటీఎం, యూపీఐ ద్వారా PF విత్ డ్రా
పీఎఫ్ నగదు ఉపసంహరణ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులోభాగంగా ఏటీఎం, యూపీఐ విత్‌డ్రా చేసుకునే సదుపాయం తీసుకొస్తామని ఇదివరకే ప్రకటించింది.
పీఎఫ్ నగదు ఉపసంహరణ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులోభాగంగా ఏటీఎం, యూపీఐ విత్‌డ్రా చేసుకునే సదుపాయం తీసుకొస్తామని ఇదివరకే ప్రకటించింది. తాజాగా ఈ అంశంపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ మాట్లాడారు. 2026 మార్చిలోపు ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని వెల్లడించారు. ఇప్పటివరకు ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న తమ సొంత నిధులను ఉపసంహరించుకోవడానికి చందాదారులు అనేక పత్రాలు సమర్పించాల్సి వస్తోందని మంత్రి అన్నారు. దీన్ని సులభతరం చేయడమే తమ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఇప్పటికే ఆధార్, యూఏఎన్ అనుసంధానం అయ్యాయని గుర్తుచేశారు. ఆపై పీఎఫ్ ఖాతాను బ్యాంక్ ఖాతాకు అనుసంధానం చేయడం ద్వారా డెబిట్ కార్డుతో ఏటీఎంలో విత్‌డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.