News4th Aug 03:32 PMSunil Byrisetty1 min read
తెలుగుజాతి గర్వించేలా అమరావతి
తెలుగు జాతి గర్వించేలా రాజధాని అమరావతిని సీఎం చంద్రబాబు నిర్మిస్తున్నారని, 2028 ఆగస్టు నాటికి మొదటి విడత నిర్మాణాలు పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఎస్.సవిత త
తెలుగు జాతి గర్వించేలా రాజధాని అమరావతిని సీఎం చంద్రబాబు నిర్మిస్తున్నారని, 2028 ఆగస్టు నాటికి మొదటి విడత నిర్మాణాలు పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఎస్.సవిత తెలిపారు. అబద్ధపు పునాదులపై ఏర్పడిన వైసీపీ ఆనాడు అమరావతి గ్రాఫిక్స్ అని తప్పుడు ఆరోపణలు చేసి పబ్బం గడుపుకుందన్నారు. గ్రాఫిక్స్ కు, వాస్తవాలకు జగన్ కు తేడా తెలియదా..? అని ప్రశ్నించారు. జగన్ విధ్వంసపు క్రెడిట్ ఎవ్వరికీ అక్కర్లేదని, తమ ప్రభుత్వానికి అభివృద్ధి అని స్పష్టం చేశారు. చదువు గురించి జగన్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని, స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో చదువుకున్న మంత్రి నారా లోకేశ్ తో ఆయనకేంటి పోలికని ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతి పనులను మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, ఎస్.సవిత పరిశీలించారు. మంత్రుల నివాసాలను తరవాత సచివాలయం, హెచ్ ఓడీ ఐకానిక్ టవర్లను, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల టవర్లను పరిశీలించారు. ఇప్పటికే పూర్తయిన మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాసాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలపై మంత్రులు ఆనందం వ్యక్తంచేశారు.