News18th Oct 11:09 AMSunil Byrisetty1 min read
పీహెచ్సీ వైద్యులు వెంటనే విధుల్లో చేరాలి
ప్రజారోగ్యం దృష్ట్యా వెంటనే సమ్మెను విరమించి విధుల్లో చేరాలని పీహెచ్సీ వైద్యులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ విజ్ఞప్తిచేశారు. పీజీ మెడికల్ ఇన్-సర్వీసు కోటాలో ఈఏడ
ప్రజారోగ్యం దృష్ట్యా వెంటనే సమ్మెను విరమించి విధుల్లో చేరాలని పీహెచ్సీ వైద్యులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ విజ్ఞప్తిచేశారు. పీజీ మెడికల్ ఇన్-సర్వీసు కోటాలో ఈఏడాదికి 20% సీట్లను అన్ని స్పెషాల్టీ కోర్సుల్లో కలిపి కేటాయిస్తామని గతంలో ఇచ్చిన హామీపై జీఓ విడుదలకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. సచివాలయంలో పీహెచ్సీ వైద్యుల సంఘం నేతలతో ఆయన చర్చించారు. సౌరభ్ గౌర్ మాట్లాడుతూ వైద్యులు పీహెచ్సీ విధులకు దూరంగా ఉండడం మంచిది కాదని హితవు పలికారు. వైద్యుల ట్రైబల్ అలవెన్సు, నోషనల్ ఇంక్రిమెంట్లు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు, సర్వీసు వ్యవహారాలకు సంబంధించిన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. విధులకు వైద్యుల హాజరుపై వివరాలు సేకరిస్తున్నామన్నారు. అయితే 2026-27 నుంచి కనీసం మూడేళ్ల పాటు 15% సీట్లను పీజీ ఇన్-సర్వీసు కోటాలో అన్ని స్పెషాల్టీ కోర్సుల్లో కేటాయించాలని సంఘం నేతలు కోరారు. పలువురు మాత్రం రెండేళ్లపాటు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ భవిష్యత్తులో ఇన్-సర్వీసు కోటా ఎంతవరకు ఉండాలన్న దానిపై నవంబరులోగా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాన్ని తీసుకుంటుందని చెప్పారు.