Spiritual28th Dec 03:49 PMSunil Byrisetty1 min read
నడకదారి భక్తుల కోసం ఏడో మైలు వద్ద పీహెచ్సీ
అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని తిరుమల నుండి తిరుపతికి వెళ్లే దిగువ ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని
అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని తిరుమల నుండి తిరుపతికి వెళ్లే దిగువ ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరిలతో కలిసి ఆదివారం ఉదయం ప్రారంభించారు. చైర్మన్ మాట్లాడుతూ నడకదారి భక్తుల సౌకర్యార్థం ఏడో మైలు వద్ద ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అత్యావసర పరిస్థితిలో భక్తులు ఈ కేంద్రం వద్ద వైద్య సేవలను వినియోగించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. ఇప్పటికే శ్రీవారి మెట్టు మార్గంలో కూడా ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.