Business Type15th Jun 04:47 PMSunil Byrisetty1 min read
యూపీఐ సూపర్ ఫాస్ట్.. 10 సెకన్లలోనే పేమెంట్లు!
యూపీఐ పేమెంట్లు చేసినప్పుడు నిరీక్షించే సమయానికి ఎన్పీసీఐ చెక్ పెడుతోంది. ఈ నెల 16 నుంచి యూపీఐ లావాదేవీలను వేగవంతం చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు సౌకర్యవంతమైన
యూపీఐ పేమెంట్లు చేసినప్పుడు నిరీక్షించే సమయానికి ఎన్పీసీఐ చెక్ పెడుతోంది. ఈ నెల 16 నుంచి యూపీఐ లావాదేవీలను వేగవంతం చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు సౌకర్యవంతమైన లావాదేవీలు జరిగేలా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొస్తోంది. ముఖ్యంగా యూపీఐ పేమెంట్ చేశాక ధ్రువీకరణ కోసం కొద్ది సెకన్లు నిరీక్షించాల్సి ఉంటుంది. ఇప్పుడు NPCI యూపీఐ సర్వీసులకు రెస్పాన్స్ టైమ్ తగ్గించింది. NPCI సర్క్యులర్ ప్రకారం.. సాధారణంగా ఉపయోగించే యూపీఐ, ఏపీఐ రెస్పాన్స్ టైమ్.. లావాదేవీ స్టేటస్ చెక్ చేయడం, లావాదేవీ రివర్సల్ వంటివి ఇప్పటి వరకు 30 సెకన్ల సమయం పడుతోంది. ఇకనుంచి కేవలం 10 సెకన్లలోనే ఆ సేవలు పొందేలా సమయం తగ్గించింది. ఈ మార్పులను వెంటనే అమలు చేయాలంటూ గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే సహా అన్ని పేమెంట్ సర్వీసు ప్రొవైడర్లు, బ్యాంకులకు ఎన్‌పీసీఐ సూచనలు చేసింది. ఫెయిలైన లావాదేవీలకు సంబంధించి రివర్స్ లేదా పేమెంట్ స్టేటస్ చెక్ చేసేందుకు టర్నరౌండ్ టైమ్ కూడా 10 సెకన్లకు తగ్గుతుంది.