Business Type24th Sep 01:15 PMSunil Byrisetty1 min read
మెగా ఐపీఓ దిశగా ఫోన్ పే!
ప్రముఖ పేమెంట్స్ యాప్ ఫోన్ పే ఐపీఓ దిశగా అడుగులు వేస్తోంది. రూ. 12 వేల కోట్లతో ఫోన్ పే మెగా ఐపీఓ రానున్నట్లు తెలుస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యేందుకు వాల్‌మార్ట్
ప్రముఖ పేమెంట్స్ యాప్ ఫోన్ పే ఐపీఓ దిశగా అడుగులు వేస్తోంది. రూ. 12 వేల కోట్లతో ఫోన్ పే మెగా ఐపీఓ రానున్నట్లు తెలుస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యేందుకు వాల్‌మార్ట్‌కు చెందిన ఈ ఫిన్‌టెక్ సంస్థ చర్యలు ప్రారంభించింది. రూ. 12 వేల కోట్ల విలువైన మెగా ఐపీఓ కోసం సెబీ వద్ద డ్రాఫ్ట్ పేపర్లు దాఖలు చేసినట్లు సమాచారం. విశ్వసనీయ ప్రీ- ఫైలింగ్ రూట్‌లో ఈ ఐపీఓ కోసం దాఖలు చేసినట్లు కథనాలు వస్తున్నాయి. ఫోన్ పే ఐపీఓపై స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.