Crime10th Jun 04:16 PMSunil Byrisetty1 min read

బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లే లక్ష్యంగా సైబర్‌ మోసాలు

దేశంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లే లక్ష్యంగా సైబర్‌ మోసగాళ్లు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. కేవైసీని ట్రాయ్‌ నిలిపివేసిందని, 24 గంటల్లో సిమ్‌ బ్లాక్‌ అవుతుందని ఫేక్‌ మెసేజ్‌లు పంపుతున్న

బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లే లక్ష్యంగా సైబర్‌ మోసాలు
దేశంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లే లక్ష్యంగా సైబర్‌ మోసగాళ్లు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. కేవైసీని ట్రాయ్‌ నిలిపివేసిందని, 24 గంటల్లో సిమ్‌ బ్లాక్‌ అవుతుందని ఫేక్‌ మెసేజ్‌లు పంపుతున్నారు. ఒక నంబర్‌కు కాల్‌ చేయాలంటూ మోసపూరిత సందేశాలను మోసగాళ్లు పంపుతున్నారు. అలా కాల్ చేస్తే ఓటీపీ చెప్పమని అడిగి, ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వ పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం ఇది పూర్తిగా నకిలీదని స్పష్టం చేసింది. సిమ్‌ కేవైసీకి సంబంధించి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎలాంటి నోటీసులు పంపదని వెల్లడించింది. అనుమానాస్పద సందేశాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచనలు చేసింది.
Scam
Cyber crimes
BSNL Customers
Pib fact check
KYC
fake messages
SIM
బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లే లక్ష్యంగా సైబర్‌ మోసాలు
Scroll for the next article