News2nd Jan 11:20 AMSunil Byrisetty1 min read

రేషన్ షాపుల్లో గోధుమ పిండి పంపిణీ ప్రారంభం

ఏపీలో ప్రయోగాత్మకంగా రేషన్ కార్డుదారులకు గోధుమ పిండి పంపిణీ చేస్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లోని కార్డుదారులకు కిలో రూ.20కు గోధుమ పిండిని అందిస్తున్నామని ఏపీ పౌరసరఫరాల శాఖ కార్పొరేషన

రేషన్ షాపుల్లో గోధుమ పిండి పంపిణీ ప్రారంభం
ఏపీలో ప్రయోగాత్మకంగా రేషన్ కార్డుదారులకు గోధుమ పిండి పంపిణీ చేస్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లోని కార్డుదారులకు కిలో రూ.20కు గోధుమ పిండిని అందిస్తున్నామని ఏపీ పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ ఎండీ ఢిల్లీరావు తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 1800 టన్నుల గోధుమలను కేంద్రం ప్రభుత్వం నుంచి మన రాష్ట్రం తీసుకోలేదన్నారు. దీనిపై కేంద్రంతో మాట్లాడి గోధుమలు తీసుకుని, వాటిని మిల్లుల ద్వారా కాకుండా పాత పద్ధతిలో (తిరగలి ద్వారా) పిండి పట్టించి కార్డుదారులకు ఇస్తున్నామని చెప్పారు. దీని వల్ల గోధుమ పిండిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. జిల్లా కేంద్రాల్లో గోధుమ పిండి పంపిణీ విజయవంతమైతే తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు.
Andhra Pradesh
Ration Shops
Wheat Flour Distribution
Public Distribution System
Civil Supplies
ఆహార భద్రత
ఏపీ ప్రభుత్వం
ప్రయోగాత్మక పథకం
Scroll for the next article