Spiritual26th Aug 03:07 PMSunil Byrisetty1 min read
ఆధ్యాత్మిక పిఠాపురానికి అభివృద్ధి వెలుగులు
“ఆధ్యాత్మికత కొలువైన క్షేత్రంలో అభివృద్ధి ఉండాలి.. చరిత్ర ఉన్న చోట పరిరక్షణ ఉండాలి.. సంస్కృతి ఉన్న చోట అది మరింత శోభిల్లాలి” అనేది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృఢ సంకల్పం. పిఠాపురం
“ఆధ్యాత్మికత కొలువైన క్షేత్రంలో అభివృద్ధి ఉండాలి.. చరిత్ర ఉన్న చోట పరిరక్షణ ఉండాలి.. సంస్కృతి ఉన్న చోట అది మరింత శోభిల్లాలి” అనేది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృఢ సంకల్పం. పిఠాపురం నియోజకవర్గ చారిత్రక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుతూ, ఆ వైభవాన్ని భవిష్యత్ తరాలకు మరింత ఘనంగా అందించాలనే ఆయన కార్యాచరణ ఇప్పుడు క్షేత్రస్థాయిలో రూపుదాలుస్తోంది. పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రత్యేక చొరవ తీసుకొని, నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధి , భజన మందిరాల నిర్మాణం, కళ్యాణ మండపాల ఏర్పాటు కోసం ఏకంగా రూ. 30.66 కోట్ల నిధులను మంజూరు చేయించారు. ఆయన నిరంతర పర్యవేక్షణలో ఈ అభివృద్ధి పనులు ప్రస్తుతం నియోజకవర్గవ్యాప్తంగా శరవేగంగా జరుగుతున్నాయి.
నియోజకవర్గంలోని 24 ప్రముఖ దేవాలయాల అభివృద్ధి కోసం రూ.17.06 కోట్ల నిధులను కేటాయించారు. ఈ నిధులతో ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ, మరమ్మతులతో పాటు భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. గొల్లప్రోలు సీతారామస్వామి ఆలయంలో ప్రాకార మండపం నిర్మాణం తుది దశకు చేరింది. కొత్తపల్లిలోని జగన్నాథ, సత్యనారాయణ స్వామి ఆలయాల్లో ధ్వజస్తంభాల ప్రతిష్ఠాపన పనులు పూర్తయ్యాయి. పిఠాపురం కొత్తపల్లి వీధిలోని వేణుగోపాలస్వామి ఆలయంలో అర్చకుల క్వార్టర్ల స్లాబ్ పనులు పూర్తయ్యాయి.