News14th Nov 03:54 PMSunil Byrisetty1 min read
ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురం
‘పిఠాపురం నియోజకవర్గం పరిధిలో శక్తిపీఠం శ్రీ పురూహూతిక అమ్మవారు, శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయాలు, శ్రీపాద శ్రీ వల్లభ పీఠం కొలువై ఉన్నాయి. ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురాన్ని
‘పిఠాపురం నియోజకవర్గం పరిధిలో శక్తిపీఠం శ్రీ పురూహూతిక అమ్మవారు, శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయాలు, శ్రీపాద శ్రీ వల్లభ పీఠం కొలువై ఉన్నాయి. ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురాన్ని అభివృద్ధి చేసే ప్రణాళికను వేగంగా ముందుకు తీసుకువెళ్లాల’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. ప్రఖ్యాత ఆలయాలతోపాటు నియోజకవర్గంలో జీర్ణావస్థకు చేరిన ఆలయాలను ఇప్పటికే గుర్తించామనీ, వాటికి పునరుజ్జీవం కల్పించే పనులుకు అవసరమైన నిధులు దేవాదాయ శాఖ సమకూరుస్తుందని తెలిపారు. దేవాదాయ శాఖ సహకారంతో ఆలయాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి అన్నారు. ప్రధాన ఆలయాలు అయిన శ్రీ పురూహూతిక అమ్మవారు, శ్రీ కుక్కుటేశ్వర స్వామి, శ్రీపాద శ్రీ వల్లభస్వామి ఆలయాలతోపాటు 19 ఆలయాల అభివృద్ధి నిమిత్తం కామన్ గుడ్ ఫండ్ నుంచి రూ.20 కోట్ల నిధులు మంజూరు చేసేందుకు ఇప్పటికే దేవాదాయ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించిందనీ, మ్యాచింగ్ గ్రాంట్ తో నిధులు మంజూరు చేస్తారన్నారు. ఇందులో రూ.6 కోట్లు శ్రీ పురూహూతిక అమ్మవారు, శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి కేటాయిస్తున్నారన్నారు.