News26th Apr 11:46 AMSunil Byrisetty1 min read
అమర్‌నాథ్ యాత్రపై కేంద్రం క్లారిటీ!
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామని కేంద్రం ప్రకటించింది. జూలై 3 నుంచి ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్రపై కేంద్రం కీలక నిర
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామని కేంద్రం ప్రకటించింది.
జూలై 3 నుంచి ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్రపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
యాత్ర సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.
కశ్మీర్ పర్యాటక కేంద్రంగా తిరిగి అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
కశ్మీర్ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని పేర్కొన్నారు.
అలాగే ఉగ్రవాదులను ఆశ్రయించే వారిని గుర్తించి శిక్షిస్తామని చెప్పారు.
దీంతో అమర్‌నాథ్ యాత్రికులు సిద్ధమవుతున్నారు.