Agriculture21st May 01:51 PMSunil Byrisetty1 min read
సాగు సమస్యలపై సమరం
ఖరీఫ్ సంసిద్దతపై వ్యవసాయ అనుబంధ శాఖల ఉన్నత స్థాయి అధికారులతో పాటు అన్ని జిల్లాల అధికారులతో రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్థకం, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడ
ఖరీఫ్ సంసిద్దతపై వ్యవసాయ అనుబంధ శాఖల ఉన్నత స్థాయి అధికారులతో పాటు అన్ని జిల్లాల అధికారులతో రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్థకం, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు.
ఖరీఫ్ పంట సాగు విషయంలో రైతులు ఎటు వంటి ఇబ్బందులు, సమస్యలను ఎదుర్కొనేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు.
రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి అధికారులు వరకూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయానికి అనుగుణంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో 15 శాతం వృద్ది రేటును సాధించాలనే లక్ష్యంతో సమైక్యంగా కృషి చేయాలని ఆదేశించారు. ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్, వాల్యూమ్ అండ్ మార్కెటింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ ప్రకృతి సేద్యాన్ని, సాంప్రదాయ పంటల సాగును క్రమంగా తగ్గిస్తూ ఉద్యానమన పంటల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సూచించారు.
వ్యవసాయ యాంత్రీకరణ క్రింద 50 శాతం రాయితీ సొమ్మును ముందుగానే అందజేస్తున్నామని వివరించారు.