News26th Mar 03:16 PMSunil Byrisetty1 min read

జిల్లాల సమగ్రాభివృద్ధికి ప్రణాళిక

రాష్ట్రంలో ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో జోన్-1 పరిధిలోని ఆరు జిల్లాలపై సీఎం సమీక్షించారు. కలెక్టర్ల నుంచి 2025

జిల్లాల సమగ్రాభివృద్ధికి ప్రణాళిక
రాష్ట్రంలో ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో జోన్-1 పరిధిలోని ఆరు జిల్లాలపై సీఎం సమీక్షించారు. కలెక్టర్ల నుంచి 2025-26 యాక్షన్ ప్లాన్ ను తీసుకున్న సీఎం.. జిల్లాస్థాయిలో పాలనపై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా టూరిజం రంగంపై ఎక్కువ దృష్టి పెట్టాలని సీఎం కోరారు. తాను 30 ఏళ్లుగా పర్యాటకాభివృద్ధి కోసం మాట్లాడుతున్నానని, అప్పుడు తన మాటలను అర్థం చేసుకోని కమ్యూనిస్టులు కూడా ఇప్పుడు టూరిజంపై తనతో ఏకీభవిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. నిన్న తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో పర్యటకాభివృద్ధిపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఉత్తరాంధ్రతోపాటు రాష్ట్రంలో కాస్మోపాలిటిన్ సిటీగా వృద్ధి చెందుతున్న విశాఖలో కనీసం ఐదు వేల హోటల్ గదులు అందుబాటులో ఉండాలని సీఎం సూచించారు. అదేవిధంగా అనకాపల్లి, అరకు ప్రాంతాల్లో కూడా అధునాతన వసతులతో పర్యాటకులకు ఆతిథ్యం కల్పించాలని కలెక్టర్లకు నిర్దేశించారు.
development of districts
comprehensive
Andhra Pradesh
ముఖ్యమంత్రి చంద్రబాబు
Scroll for the next article