Business Type31st Jul 12:16 PMSunil Byrisetty1 min read
ఇల్లు కొనాలా.. లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు రెడీ
సొంతింటి కోసం ప్లాన్ చేసుకునేవారికి రాబోయే పండుగల సీజన్ లోన్ ఆఫర్లు తెస్తోంది. పండుగ ప్రత్యేక ఆఫర్లలో ప్రధానంగా బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజులో 50% నుండి 100% వరకు పూర్తి మినహాయింపును
సొంతింటి కోసం ప్లాన్ చేసుకునేవారికి రాబోయే పండుగల సీజన్ లోన్ ఆఫర్లు తెస్తోంది. పండుగ ప్రత్యేక ఆఫర్లలో ప్రధానంగా బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజులో 50% నుండి 100% వరకు పూర్తి మినహాయింపును ప్రకటిస్తున్నాయి. సాధారణంగా రుణ మొత్తంలో 0.25% నుంచి 0.50% వరకు ఉండే ప్రాసెసింగ్ రుసుము రద్దు కావడం వల్ల కొనుగోలుదారులకు మంచి డిస్కౌంట్ లభించినట్లే. ప్రారంభంలోనే వేలాది రూపాయల అదనపు భారం తగ్గుతుంది. సిబిల్/క్రెడిట్ స్కోరు బాగుంటే, ప్రామాణిక వడ్డీ రేట్లపై 10 నుండి 25 బేసిస్ పాయింట్ల వరకు ప్రత్యేక వడ్డీ సడలింపులు కూడా పొందవచ్చు. అలాగే యాప్, డిజిటల్ పోర్టల్స్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ఖాతాదారులకు అదనపు వడ్డీ తగ్గింపుతో పాటు వేగంగా అనుమతులు లభించనున్నాయి. మహిళా దరఖాస్తుదారులకు మరో 0.05% వరకు వడ్డీ తగ్గింపు ఆఫర్లున్నాయి.