Business Type27th Jul 03:59 PMSunil Byrisetty1 min read
ఇల్లు అమ్మాలా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి!
ఇల్లు కొనుక్కునేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో అమ్మేటప్పుడూ అంతే జాగ్రత్తగాఉండాలి. చట్టపరమైన చిక్కులు లేకుండా అమ్మడం కీలకమైన ప్రక్రియ. సరైన అవగాహన, ముందస్తు ప్రణాళిక లేకపోతే వి
ఇల్లు కొనుక్కునేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో అమ్మేటప్పుడూ అంతే జాగ్రత్తగాఉండాలి. చట్టపరమైన చిక్కులు లేకుండా అమ్మడం కీలకమైన ప్రక్రియ. సరైన అవగాహన, ముందస్తు ప్రణాళిక లేకపోతే విక్రయం సమయంలో మోసపోతారు. అంతే కాకుండా, భవిష్యత్తులో లీగల్ సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఇంటిని అమ్మకానికి పెట్టే ముందే దానికి సంబంధించిన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలి. సేల్ డీడ్, లింక్ డాక్యుమెంట్లు, ఈసీ , ప్రాపర్టీ టాక్స్ రసీదులు, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ పత్రాలతో పాటు కరెంట్, వాటర్ బిల్లుల బాకీలు లేకుండా చూసుకోవాలి. ఆస్తిపై ఎలాంటి లీగల్ వివాదాలు లేదా బ్యాంక్ ఈకేవైసీ, రుణాల బాకీలు లేవని స్పష్టం చేసే లీగల్ ఒపీనియన్ కాపీని సిద్ధంగా ఉంచితే, కొనుగోలుదారుల్లో విశ్వసనీయత పెరుగుతుంది. బేరం కుదిరిన వెంటనే పక్కా నిబంధనలతో అగ్రిమెంట్ ఫర్ సేల్ చేసుకోవడం ముఖ్యం. అందులో మొత్తం ప్రాపర్టీ విలువ, వారు చెల్లిస్తున్న అడ్వాన్స్ సొమ్ము, మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ చెల్లించడానికి ఇచ్చే గడువును సాధారణంగా 30 నుండి 90 రోజులు స్టాంప్ పేపర్‌పై నోటరీ చేయించాలి. నిర్ణీత గడువులోగా మిగిలిన సొమ్ము చెల్లించకపోతే తీసుకోవాల్సిన చర్యలు, రిజిస్ట్రేషన్ ఖర్చులు ఎవరివి అనే విషయాలను స్పష్టంగా పేర్కొనాలి.