News27th Sep 12:49 PMSunil Byrisetty1 min read
సముద్ర ఆధారిత పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు
సముద్ర ఆధారిత పర్యాటక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర ప్రణాళికలు రూపొందిస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శాసనసభలో ప్రసం
సముద్ర ఆధారిత పర్యాటక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర ప్రణాళికలు రూపొందిస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శాసనసభలో ప్రసంగించిన మంత్రి దుర్గేష్ గత ప్రభుత్వ హయాంలో పర్యాటకాభివృద్ధి శూన్యమని చెబుతూ వారి అనాలోచిత నిర్ణయాలతో పర్యాటక రంగం కుదేలైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వ 15 నెలల కాలంలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధికి తీసుకున్న చర్యలను సమగ్రంగా వివరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో సరికొత్త ఆవిష్కరణలకు ఏపీ టూరిజం శాఖ శ్రీకారం చుట్టిందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న సదుద్దేశంతో సమగ్ర పర్యాటకాభివృద్ధికి రూపొందించిన ప్రణాళికలు, పర్యాటక ప్రాజెక్టులను గురించి మంత్రి దుర్గేష్ సభలో ప్రస్తావించారు. గత శాసనసభ సమావేశాల్లో పర్యాటకాభివృద్ధి గురించి చెప్పిన మాటలను ఇప్పటికే 50 శాతం చేతల్లో చూపించామని మంత్రి కందుల దుర్గేష్ ఘంటాపథంగా చెప్పారు.