News6th Nov 05:05 PMSunil Byrisetty1 min read

రెండేళ్ళలో కీలక ప్రాజెక్టులు పూర్తిచేసేలా ప్రణాళికలు

ఈ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించి పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తిచేసేలా అధికారులకు దిశా, నిర్దేశం చేయనున్నారని తెలిపారు జలవనరుల శాఖ మంత్రి

రెండేళ్ళలో కీలక ప్రాజెక్టులు పూర్తిచేసేలా ప్రణాళికలు
ఈ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించి పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తిచేసేలా అధికారులకు దిశా, నిర్దేశం చేయనున్నారని తెలిపారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. సచివాలయంలో ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల పురోగతిపై సంబందిత అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్ష, సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని, రాబోయే రెండేళ్ళలో రూ.2వేల కోట్లు పైగా ఖర్చు చేసి, కీలక ప్రాజెక్టులు పూర్తి చేయాలని సూచించారని తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు. బిఆర్‌ఆర్ వంశధార, తోటపల్లి, వంశధార-నాగావళి లింక్, జంఝావతి రిజర్వాయర్, హిరమండలం లిఫ్ట్, నాగావళి- చంపావతి, మహేంద్ర తనయ, తారకరామతీర్ధసాగర్, మడ్డువలస రిజర్వాయర్, వంటి కీలకమైన ప్రాజెక్టులను పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం అని అన్నారు. ఈ 9 ప్రాజెక్టులను ప్రాధాన్యతా ప్రాజెక్టులుగా గుర్తించి, ఆయా ప్రాజెక్టుల పనులతో పాటు, ఆర్అండ్ఆర్, మిగిలిన పనులపై సైతం మంత్రి రామానాయుడు ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా ఉత్తరాంధ్రలో 1.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి రావడంతో పాటు, మరో 2.48లక్షల ఎకరాల ఆయకట్టు స్ధిరీకరణ సాధ్యమౌతుంది అని గుర్తించామన్నారు.
Andhra Pradesh
Chandrababu Naidu
Nimmala Ramanaidu
North Andhra
Irrigation Projects
Water Resources Department
BRR Vamsadhara
Thotapalli
వంశధార-నాగావళి లింక్
జంఝావతి రిజర్వాయర్
హిరమండలం లిఫ్ట్
నాగావళి-చంపావతి
మహేంద్ర తనయ
Scroll for the next article